All
Untitled Post
సీఎం కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తాజాగా హైదరాబాద్, కర్మన్ ఘాట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్‌ఎస్ పార్టీలో భారీ చీలిక వచ్చిందని, కేసీఆర్ ఇంట్లో అర్థరాత్రి పూట ఏమైనా జరగవచ్చని, అల్లుడి నుంచి ముప్పు తగ్గిందని, కేటీఆర్ నుంచి ఆయనకు ముప్పు ఉందని యనకు అనుక్షణం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, కేసిఆర్ ను దించి వేయాలని ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు మాట్లాడుతున్నారని గుర్తు చేసిన ఆయన, ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, టీఆర్‌ఎస్ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలని అన్నారు.




