కుప్పంలో అర్బన్ సీఐ శ్రీధర్ తీవ్ర వ్యాఖ్యలు….
కుప్పంలో అర్బన్ సీఐ శ్రీధర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నిరసనలు అడ్డుకునే సమయంలో
ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ గోరంట్లపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నిరసనలు
వ్యక్తం చేసింది. నిరసన కార్యక్రమాలకు, దిష్టిబొమ్మ దగ్ధానికి వీల్లేదని పోలీసులు పేర్కొన్నారు.
ఒక ఎంపీ ఇలా వ్యవహరిస్తారా అంటూ స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇదేమీ కొత్తకాదు..
ఇలాంటి వాళ్లు దండిగా ఉంటారని సీఐ శ్రీధర్ సమర్ధించినట్లు తెలిసింది. మీవాళ్లు ఇలా చేయలేదా
అంటూ… సీఐ వాదించారు. దేశాన్ని కాల్చండి అంటూ సీఐ శ్రీధర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఐ వ్యాఖ్యలపై
టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ… అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సీఐ శ్రీధర్, ఎంపీ గోరంట్ల
ఒకే బ్యాచ్‌కు చెందినవారని సమాచారం. తన మిత్రుడిని వెనకేసుకొచ్చే క్రమంలో సీఐ శ్రీధర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.


