Allవార్తలు

డిసెంబ‌ర్‌ 16న నిర్భయ దోషులకు ఉరి ?

అది 2012, డిసెంబర్‌ 16వ తేదీ.. ఢిల్లీలో ఆరుగురు మృగాళ్లు నిర్భయ పై దాడి చేసి అత్యాచారం చేశారు. యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిర్భయ మృతి చెందింది. ఆమె పై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్‌ 16నే ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు.

ఈ నెల 16న ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఈ శిక్ష అమలు చేస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు చెప్పారు. తమకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం దోషులు తిహార్‌ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు  చేసుకుంటున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు జూవైనల్‌ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు. మరో దోషి రామ్‌సింగ్‌ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దోషులకు శిక్ష అమలులో జరిగిన ఆలస్యం పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంతో ఉరిశిక్షకు లైన్‌క్లియర్‌ అయ్యింది. కాగా 2012 డిసెంబర్‌ 16న ఆరుగురు కలిసి నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్‌ 16నే నలుగురు దోషులను ఉరి తీస్తుండటం విశేషం. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం ప్రజల దృష్టి నిర్భయ ఘటన దోషులపైకి మళ్లిన విషయం తెలిసిందే. ఘటన జరిగి ఏడేళ్లకు పైగా గడుస్తున్నా.. దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడంలేదని మహిళా సంఘాలతో సహా.. పలువురు ప్రముఖలూ ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు చేయకపోవడంపై నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ నిర్ణయంతో వారి డిమాండ్‌ నెరవేరనుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker