Allసినిమాలు

టాలీవుడ్‌కి మ‌రో బ‌డానిర్మాత కొడుకు?

టాలీవుడ్‌లో బ‌డా నిర్మాత‌లెవ‌రంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌టి అల్లుఅర‌వింద్ అయితే రెండోది  దిల్‌రాజు అని చెప్ప‌వ‌చ్చు.  డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని మొద‌లు పెట్టిన ఆయ‌న  నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులను వెతికి పట్టుకొని మంచి కథలను జడ్జ్ చేయగల రాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఆయన బ్యాన‌ర్‌నుంచి సినిమా వ‌స్తుందంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు  ఉంటుంది. క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో ఆయన్ను మించిన వారు లేరు. ఆయ‌న బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తుందంటే చాలు హిట్ కాతాలోకే వెళుతుంది త‌ప్పించి ఫ్లాప్‌లు చాలా త‌క్కువ‌నే చెప్పాలి.

ఇప్పుడున్న స్టార్ దర్శకుల్లో చాలా మంది దిల్ రాజు స్కూల్ నుంచి వచ్చినవారే. బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఎలాంటి స్టార్స్ అయినా టాలీవుడ్ లో ఏదైనా పని పడితే ముందు దిల్ రాజునే కలుసుకుంటారు. దేశ ప్ర‌ధాని అయిన మోడీ కూడా ఇన్వైట్ చేశారంటే రాజుగారి రేంజ్ ఏంటో అర్ధ‌మ‌య్యే ఉంట‌ది.  ఇక విష‌యం ఏమిటంటే… దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఒక యువకుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ గత కొంత కాలంగా నటనలో శిక్షణ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అసలైతే గతంలోనే సతీష్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన దిల్ రాజు ఆశిష్ ను హిరోఘా పెట్టి సినిమాని నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఆ క‌థ  పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు హుషారు డైరెక్టర్ శ్రీ హర్షకి ఆ బాధ్య‌త‌లు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.  . ఇక సినిమా టైటిల్ ని రౌడీ బాయ్స్ అని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker