“పగ పగ పగ” సినిమాను అదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు..ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు కోటి

సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో సత్య నారాయణ సుంకర వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా భారీ ఎత్తున నిర్మించిన చిత్రం “పగ పగ పగ”.ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సంగీతం అందించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 22 న గ్రాండ్ రిలీజైన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా
చిత్ర దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ..నేను ఈ రోజు డైరెక్టర్ కావడానికి కారణమైన మా దర్శక గురువులకు ధన్యవాదములు. నేను చెప్పిన కథ విని ఎంతో ఎగ్జైట్ అయి ఈ సినిమా తియ్యడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. సంగీత దర్శకుడు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తూ అలాగే అద్భుతంగా నటించారు. ఫుల్ లవ్ & కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కంటెంట్ తో ఈ నెల 22 న విడుదలైన ఈ సినిమా అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. చూడని వారు వెళ్లి చూసి మమ్మల్ని మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..



