Allసినిమాలు

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు సెలక్ట్ అయిన జార్జ్‌రెడ్డి


కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో జార్జ్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 45 ఏళ్ల కింద చనిపోయిన ఈ స్టూడెంట్ లీడర్ బయోపిక్ ఇప్పుడు జీవన్ రెడ్డి తెరకెక్కించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ “జార్జ్ రెడ్డి” జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన “జార్జ్ రెడ్డి” చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. ఈమేరకు డిసెంబర్ 22 మరియు 23వ తారీఖుల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. నోయిడా, ఢిల్లీలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న “జార్జ్ రెడ్డి” చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రిలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్, వంగవీటి రంగ, సావిత్రి నిజజీవిత కథల ఆధారంగా సినిమాలనుతెరకెక్కిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి దశలోనే విప్లవ ఉద్యమాన్ని నడిపిన జార్జి రెడ్డి జీవితాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చారు. ఈ చిత్రం నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker