
హీరోగానే కాకుండా విలన్‌గా కూడా కార్తికేయ దూసుకుపోతున్నారు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటించారు. తాజాగా ఆయనకు తమిళ సినిమాలో ప్రతినాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో విలన్‌గా నటించనున్నారు కార్తికేయ. తాజాగా అజిత్ -శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలుగులో అజిత్ మార్కెట్ దృష్ట్యా కార్తికేయను విలన్‌గా తీసుకున్నారట. త్వరలోనే కార్తికేయ ఈ సినిమా షూటింగ్‌కు హాజరవుతారని తెలుస్తోంది….




