Allసినిమాలు

అలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఇలాంటి సినిమాలు ఎక్కువ రావాలి


“హాలీవుడ్ చిత్రాలను పరిశీలిస్తే మహిళా ప్రాధాన్య చిత్రాల కోసం ఎటువంటి కథలు వస్తున్నాయో మనకు అర్ధమవుతుంది. చార్లెజ్‌ థెరోన్‌, నికోలే కిడ్మాన్‌ ఇలాంటి చిత్రాలు చేస్తూ రాణిస్తున్నారు. వీళ్లు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే చేస్తూ సక్సెస్‌ అవుతున్నారు… అని అంటోంది కత్రినా కైఫ్‌. ఈ మధ్య బాలీవుడ్‌ హీరోయిన్లు మహిళా ప్రాధాన్య చిత్రాల గురించే చెబుతున్నారు. పారితోషికంలోనూ.. అవకాశాల్లోనూ ప్రస్తుతం ఉన్న వివక్ష పోవాలంటే ..మహిళా ప్రాధాన్య చిత్రాలు  ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందని  అంటున్నారు. దీనిపై ఇటీవలే తాప్సీ మాట్లాడింది. ఇప్పుడు కత్రినా కైఫ్‌ కూడా అదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో చెప్పింది…

“బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాలు రావాల్సి ఉంది. అందులోనూ కామెడీ.. కమర్షియల్‌ హంగులతో మహిళలు లీడ్‌ రోల్స్‌ పోషించాలి. బాలీవుడ్‌లో దానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాది దేశాలను ఓ సారి పరిశీలిస్తే.. రచయితలు మహిళా ప్రాధాన్య చిత్రాల కోసం ఎటువంటి కథలు అందిస్తున్నారో అర్ధమవుతుంది. చార్లెజ్‌ థెరోన్‌ గానీ, నికోలే కిడ్మాన్‌ గానీ చాలా కాలంగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే చేస్తూ రాణిస్తున్నారు.ఇక్కడ కూడా అటువంటి అద్భుతమైన రచనలు చేయాలి. సినిమాలు, రియాల్టీ షోస్‌లో మహిళలు ప్రధానంగా కనిపించేలా చేయాలి. అలాంటి పరిస్థితులు నటీమణులే కల్పించాలి. మహిళలు ఉత్తమ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వగలమని నమ్మకం కలిగించినప్పుడే అలాంటి కథలు సృష్టించాలనే ఆలోచన రచయితలకు వస్తుంది” అని చెప్పింది కత్రినా. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్‌ హీరోగా చేస్తున్న ‘సూర్యవంశి’ చిత్రంతో బిజీగా ఉంది కత్రీనాకైఫ్‌.

“త్వరలో నా నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ రాబోతుంది“.. అని అంటోంది కత్రినా కైఫ్‌. ఆమె గ్లామర్‌తోనే కాదు,యాక్షన్‌తోనూ మెస్మరైజ్‌ చేయగల నాయిక . పలు యాక్షన్‌ చిత్రాల్లో అలరించింది. త్వరలో కత్రినా సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుందట. ఇటీవల కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరల్డ్‌ ఛాంపియన్‌ బాక్సర్‌ మేవెదర్‌ ఫొటోని, తాను బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోని అభిమానులతో షేర్‌ చేసుకుంది. ” మేవెదర్‌ బూట్స్‌ వణక్కపోవచ్చు.. కానీ, నేను ఆ స్థానంలోకి వెళ్తున్నా. త్వరలో నా నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ రాబోతుంది” అని కత్రినా ఓ చిన్న క్లూ ఇచ్చింది. దీంతో త్వరలో బాక్సింగ్‌ నేపథ్యంలో ఉండే చిత్రంలో నటించబోతుందని అందరూ ఊహించుకుంటూ.. తెగ కామెంట్స్‌ పెడుతున్నారు. నిజంగానే కత్రినా బాక్సింగ్‌ సినిమా చేయబోతుందా? లేక మేవెదర్‌తో కలిసి నటిస్తుందా.. ఆమె నుంచి వచ్చే సర్‌ప్రైజ్‌ ఎలా ఉంటుందోనని బాలీవుడ్‌లో ఆసక్తి పెరిగింది . ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘ఏక్‌ దా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి చిత్రాల్లో తనదైన యాక్షన్‌తో మెప్పించిన కత్రినా మరో యాక్షన్‌ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్టు అర్ధమవుతోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker