ఆంధ్రప్రదేశ్
సమాజంలో మార్పు కోసమే అన్నయ్య పార్టీ పెట్టారు: పవన్

సమాజంలో మార్పు కోసమే అన్నయ్య (చిరంజీవి) పార్టీ పెట్టారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తానెప్పుడూ పదవి కోరుకోలేదని, సమాజంలో మార్పు కోరుకున్నానని పేర్కొన్నారు. కులమతాలపై రాజకీయం చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.వారసత్వ రాజకీయాలకు కొంతైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. రాయలసీమలోని మాల, మాదిగలు, బోయ, కురబ, పద్మశాలి, బలిజల గురించి ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పేదరికంలో ఉన్న కులాల గురించే తాను ఆలోచిస్తానని చెప్పారు. సీమలోని రెడ్డి, క్షత్రియ కులాల్లో కూడా పేదలు ఉన్నారని తెలిపారు. అగ్ర కులాలు ఘర్షణ పడితే సమాజంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అన్ని కులాలకూ సాధికారత రావాలని ఆకాంక్షించారు. సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని మార్పు రావాలన్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వ పనుల వల్ల రెడ్డి కులానికీ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సొంత బాబాయ్‌ని చంపినవారినీ ఇంకా ఎందుకు పట్టుకోలేదు? అని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి ఘటన కేసులో నిందితులపై చర్యలేవీ? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు.



