All

మనం “చంపేసిన” తెలుగు పదాలు..

మనం “చంపేసిన” తెలుగు పదాలు..😥😥😥😥
1. అన్నం-బువ్వ (మీల్స్)
2. కూర (కర్రీ)
3) కంచం (ప్లేట్)
4) లోటా (గ్లాస్)
5) పచ్చడి – (చట్నీ)
6) ఊరగాయ – (పికిల్)
7) నీళ్లు -(వాటర్)
8) సీసా – ( బాటిల్)
9) చెంచా – (స్పూన్)
10) పాలు -( మిల్క్)
11) పెరుగు – (కర్ఢ్)
12) కోడికూర- ( చికెన్ కర్రీ)
13) చేపకూర – (ఫిష్ కర్రీ)
14) తుండుగుడ్డ -(టవల్)
15) చొక్కా- అంగీ ( షర్ట్)
16) ఉప్పు – (సాల్ట్)
17) ఘాటు – (స్పైసీ)
18) చేతి గుడ్డ – ( హాఁ కీ)
19) బల్ల – (టేబిల్)
20) కుర్చీ – (చైర్)
21) మంచం – (కాట్)
22) పొడుగు లాగు- (పాంట్)
23) తీపి – ( స్వీట్)
24) తలుపు -( డోర్)
25) కిటికీ – ( విండో)
26) తాళం – (లాక్)
27) తాళం చెవులు -( కీస్)
28) మీట – ( స్విచ్)
29) పుస్తకం -(బుక్)
30) కాగితం – (పేపర్)
31) కలం – (పెన్)
32) పలక -(స్లేట్)
33) సూది -(నీడిల్)
34) దారం – (థ్రెడ్)
35) స్నానం – ( బాత్)
36) సబ్బు – (సోప్)
37) సంచి – (బ్యాగ్)
38) పొడి – (పౌడర్)
39) బడి – (స్కూల్)
49) పాఠం – (లెసన్)
50) లెక్కలు -(మాథ్స్)
51) ఎక్కాలు- (టేబుల్స్)
52) సాంఘీక శాస్త్రం- (సోషల్)
53) సామాన్య శాస్త్రం -( సైన్స్)
54) చరిత్ర – (హిస్టరీ)
55)అర్ధ శాస్త్రం (ఎకనామిక్స్)
56) బలపం -(స్లేట్ పెన్సిల్)
57) రంగు – (కలర్)
58) సమయం – (టైం)
59) దారి – దోవ- (రోడ్)
60) అమ్మ -(మమ్మీ)
61) నాన్న -(డాడీ)
62) నెల – (మంత్)
63) పిన్ని-ఆమ్మ- అత్త (ఆంటీ)
64) పెదనాన్న, బాబాయ్ మామ (అంకుల్)
ఇంకా ఎన్నో…ఎన్నెన్నో…
అన్ని రకాల రంగుల పేర్లు, 
అన్ని రకాల కూరగాయల పేర్లు,  
అన్నీ వారాల పేర్లు,..
అన్నీ నెలల పేర్లు.. 
చాలా జాగ్రత్తగా కుటుంబం అంతా కలసి చంపేశాం..
మనకు వీలైతే…
ఇంగ్లీష్ పదం, 
తెలియక పొతే
హిందీ పదం, 
ఇంకా తెలియక పొతే తమిళ పదమైనా వాడతాం. 
ఇంకేమీ పదం లేకపోతే… అప్పుడు తెలుగు పదాన్ని అతి కష్టంగా వాడతాం…
ఇంత దారుణంగా
భాషా హత్య ఏ భాషలోనూ జరగలేదు..
🙏🙏🙏దయచేసి చనిపోయిన పదాలను తిరిగి బతికిద్దాం 
కనీసం మన తర్వాతి తరంకోసం ఈ పనిచేద్దాం, అంపశయ్యపై ఉన్న మన భాషకు 
కొంతైనా ఊపిరి పోద్దాం…🙏🙏🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker