All
వీడని వాన కష్టాలు జూలై అనుకుంటే ఆగస్టులోనూ అవే బాధలు

హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతుంది ట్రాఫిక్ లో సామాన్యులు తడిసి రోగాలు పాలవుతున్నారు ద్విచక్ర వాహనాలు నడిపే సామాన్యులు రుగ్మతలకు లోనవుతున్నారు హైదరాబాదులో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు అంటున్నారు ఈ వానలు జులై నెలలో లాస్ట్ కి వెళ్ళిపోతాయని ఆగస్టులో వాతావరణం మరింత బాగుంటుందని నగరవాసులు అనుకున్నారు కానీ ఆగస్టులోనూ హైదరాబాదులో ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం రోడ్లు గుంతలు పనిచేసుకునేదానికి వీలు లేక సంపాదించుకోవడానికి పని లేక సామాన్యులు కష్టాలనుభవిస్తున్నారు బండ్లగూడ జాగీర్ ఉస్మాన్సాగర్ జలాశయాల నుంచి ఆరు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తు వరదతో మూసి లోకి వదలడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి మూసి లోకి వదులుతున్నారు వర్షపాతం చూస్తే షాపూర్ నగర్ లో 39 నేరేడుమెట్ల 33 జీడిమెట్లలో 32 కుతుబుల్లాపూర్ లో 32 గాజులరామారంలో 25 షేక్ పేటలో 26 ఆల్వాల్ లో 24 జూబ్లీహిల్స్ లో 20వవంతుల వర్షపాతం నమోదయింది ఈ ప్రాంతాల్లో తిరిగే ద్విచక్ర వాహనాల చోధకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు




