Allజాతీయ వార్తలు
మత్యకారులకు దొరికిన విలువై న పదార్ధం దాని విలువ… రూ.28కోట్లు

కేరళలోని తిరువనంతపురానికిమత్య్సకారులు ఎప్పటిలాగే చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన
మత్య్సకారులకు కోట్లాది రూపాయలు విలువ చేసే పదార్థం దొరికింది. దీంతో ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు
.. ఆ పదార్థాన్ని కోస్టల్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు
సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరువనంతపురానికి చెందిన కొందరు మత్స్యకారులు
ఎప్పటిలాగే శుక్రవారం కూడా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే అత్యంత విలువైన
28 కిలోల తిమింగలం వాంతి వారి కంట పడింది. వెంటనే దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చిన మత్స్యకారులు..
స్థానికంగా ఉన్న కోస్టల్ పోలీసులకు అప్పగించారు . అధికారులు ఆ పదార్థాన్ని ఫారెస్ట్ అధికారులకు
అందించారు. మత్స్యకారులకు దొరికింది నిజంగా తిమింగలం వాంతేనా కాదా అనే విషయాన్ని
ధ్రువీకరించడానికి ఫారెస్ట్ అధికారులు దాన్ని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ కి తరలించారు.
ఇదిలా ఉంటే.. తిమిగింలం వాంతికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కేజీ తిమింగలం
వాంతికి సుమారు కోటి రూపాయల ధర పలుకుంది.
దీన్ని ఎక్కువగా ఫర్ఫ్యూమ్‌ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.




