ఆంధ్రప్రదేశ్

50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్‌ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏపీ మంత్రి ఉష శ్రీచరణ్‌ అనుచరులు హంగామా సృష్టించారు. 50 మంది అనుచరులతో మంత్రి శ్రీవారి బ్రేక్‌ దర్శనానికి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్లు ఇటీవల తితిదే అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ అధికారులపై ఒత్తిడి చేసి మరీ తన అనుచరులకు మంత్రి బ్రేక్‌ దర్శనాలు చేయించారు. అంతేకాకుండా మరో 10 మంది అనుచరులకు సుప్రభాత సేవ టికెట్లను ఇప్పించారు.
ఈ విషయంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను మంత్రి తోసుకుని వెళ్లిపోయారు. మంత్రి ఉష శ్రీచరణ్‌ తీరుపై విమర్శలు వస్తున్నాయి. దర్శనం కోసం సామాన్యులు క్యూలైన్లలో నిరీక్షిస్తుంటే మంత్రి తన అనుచరులకు బ్రేక్‌ దర్శనాలు ఇప్పించడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో బ్రేక్‌ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఈనెల 21 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తితిదే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి తన అనుచరులకు బ్రేక్‌ దర్శనం ఇప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మంత్రి అప్పలరాజు 150 మంది అనుచరులకు వీఐపీ దర్శనం ఇప్పించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker