ఆంధ్రప్రదేశ్
వైసీపీ ప్రభుత్వానికి కుప్పం అంటే కక్ష ….. చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వానికి కుప్పం అంటే కక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. హంద్రీనీవా ద్వారా వీ.కోట వరకు నీరు తెస్తే.. కుప్పం వరకు నీరివ్వలేక పోయారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేసిన పనులు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కుప్పంలో చోటామోటా నాయకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ‘‘నేనొస్తే ఎక్కడికక్కడ మీ జెండాలు కడతారా?.. ఇకనైనా మీ చిల్లర చేష్టలు మానుకోండి. వైసీపీ దొంగలు జాగ్రత్త.. నేనొస్తే మీ తోకలు కట్ చేస్తా. పోలీసులు మీ పని మీరు చేసుకోండి. ఎవరిపై పడితే వారిపై తప్పుడు కేసులు పెడతారా ఎఫ్ఐఆర్ అంటే మీ జాగీరనుకున్నారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.




