ఆంధ్రప్రదేశ్
రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజుకు చేదు అనుభవం

అమరావతి: రాజధాని గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని గ్రామాల్లో పర్యటినస్తున్న సోమువీర్రాజు అక్కడి రైతులతో మాట్లాడారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామంటూ బీజేపీ చీఫ్ చెప్పగా దీనిపై పెనుమాకకు చెందిన రైతు కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, మీరు తోడుదొంగలై రాజధానిని నాశనం చేశారని రైతు శాపనార్థాలు పెట్టారు. సోమువీర్రాజుతో రైతు బొప్పన కోటేశ్వరరావు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ‘‘రాజధానిని కట్టని ఆయనను వదిలి మామీద పడితే ఎలా’’ అని సోమువీర్రాజు అన్నారు. రైతుల నిరసనతో సోమువీర్రాజు ఖంగుతిన్నారు




