All

తమిళనాడులోని అరుణాచలంలో భక్తజన సందోహం.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శివనామస్మరణతో గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు!

అరుణాచలంలో కార్తీక మహాదీపానికి భారీ ఏర్పాట్లు..

అరుణాచలంలో కార్తీక మహాదీపానికి భారీ ఏర్పాట్లు..

కార్తీక మహాదీపం వెలిగించేందుకు 150 నుంచి 175 కిలోల బరువున్న భారీ రాగి పాత్ర (కొప్పరై) సిద్ధమైంది.

సుమారు 5 నుంచి 5.5 అడుగుల ఎత్తున్న ఈ పవిత్ర పాత్రను 48 రోజుల పాటు కఠిన వ్రతం ఆచరించిన భక్తులు 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల పర్వత శిఖరానికి తీసుకెళ్లనున్నారు.

అక్కడ వెలిగే మహాదివ్య జ్యోతి దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తున్నారు. ఆ జ్యోతి వెలుగులతో అరుణాచలం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లనుంది.

అరుణాచల జ్యోతి దర్శనం.. భక్తులకు మహా పుణ్యక్షణం.

తమిళనాడులోని అరుణాచలంలో భక్తజన సందోహం..

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శివనామస్మరణతో గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు!

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ శివభక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గిరిప్రదక్షిణ చేస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో అరుణాచలం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. హరహర మహాదేవ, అరుణాచల శివ నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ సాయంత్రం జరిగే కార్తీక మహాదీపోత్సవాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానుండటంతో అరుణాచలంలో పండుగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker