Allజాతీయ వార్తలు

విలాసవంతమైన ‘యాట్‌'(విహార నౌక)ను సొంతం చేసుకున్న బిల్ గేట్స్

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ యొక్క విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందో మన ఊహలకు కూడా అందనంతగా ఉంటుంది. ఈ క్రమంలో బిల్‌గేట్స్‌  తాజాగాఓ విలాసవంతమైన యాట్‌(విహార నౌక)ను కొన్నారు. దాని ఖరీదు అక్షరాలా రూ.4600 కోట్లు. గత ఏడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో గేట్స్ దీన్ని చూసి ముచ్చట పడ్డారు. పర్యావరణానికి ఈ యాట్‌ ఏ మాత్రం హాని చేయదని తెలుసుకున్న బిల్‌గేట్స్‌ తన కోసం ప్రత్యేకించి రూపొందించుకోవాలని అనుకున్నారు. దాంతో వెంటనే ఆ నౌక తయారీ కోసం ఆర్డర్ కూడా చేసేసాడట. 

ఇంతకు ఇంతటి సంపన్నుడు కొనుగోలు చేసిన ఈ షిప్ పేరు ఆక్వా. ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న బిల్ గేడ్స్ కు ఇప్పటి వరకూ సొంతగా విహార నౌక లేదు. తన కుటుంబంతో కలిసి షిప్ లో ఎప్పుడైనా విహరించాలనుకుంటే ప్రైవేట్ యాట్ లనే ఆయన ఇప్పటి వరకూ అద్దెకు తీసుకోని వెళ్లేవారు. కానీ..పర్యవరణ హితమైన ఈ షిప్ గురించి తెలిసిన ఆయన పర్యావరణంపై ప్రేమతోనే ఈ షిప్ ను కొనుగోలు చేసారని సమాచారం. 

ఆక్వా ప్రత్యేకతలు :

1) 370 అడుగుల పొడుగు ఉండే ఈ నౌకలో కళ్లు జిగేలుమనిపించే అందం – రాజసం ఈ ఆక్వా షిప్ సొంతం. ఈ షిప్ లో నాలుగు గెస్ట్ రూములు. రెండు వీఐపీ రూమ్స్..యజమాని బిల్ గేట్స్ సూట్ ఉంటాయి. ఆక్వా వేగం గంటకు సుమారు 17 నాటికల్ మైళ్లు.. దీంట్లో ఒక్కసారి ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది.

2) ఈ విలాసవంతమైన నౌకలో నుంచి బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ బోట్స్ ఒక్కోదాని పొడుగు 32 అడుగులు. ఈ ఆక్వా నౌక నడవడానికి ఉపయోగించే ద్రవ హైడ్రోజన్ ను మైనస్ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2 ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఒక్కో ట్యాంకు సామర్థ్యం 28 టన్నులు. ఈ నౌక ప్రయాణించినప్పుడు కర్బన ఉద్గారాలూ వెలువడవు. నీళ్లు బయటకు వస్తాయంతే. దీంతో సముద్ర జలాలకు ఎటువంటి హానీ జరుగదు.

3) ఆక్వా నౌకలో సిబ్బంది సంఖ్య 31. వీరు ఈ నౌక లో ఉండే 14 మంది గెస్ట్ లకు సేవలు చేస్తుంటారు. వారికి ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లనుంచి అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటారు. అలాగే ఈ ఆక్వాలో జిమ్ – యోగా చేసుకోవటానికి స్పెషల్ గా యోగా రూమ్ – మేకప్ రూమ్ – మసాజ్ పార్లర్ – స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుతం ఆక్వా షిప్ పూర్తిగా తయారవ్వలేదు. తయారీ దశలోనే ఉంది. 2024 నాటికి ఈ యాట్ బిల్ గేట్స్ చేతికి రానుంది. మొత్తంగా ఈ ఆక్వా ని చూస్తే బిల్ గేట్స్ షిప్పా మజాకా అన్నట్లుగా ఉంది. ఇలాంటి నౌక గతంలో ఇంకెవరికి లేదు. సైనస్ అనే డిజైనర్ దానికి ఒక రూపాన్ని ఇస్తే ..లేటరల్ నేవల్ ఆర్కి టెక్ష్ట్స్ అనే సంస్థ దాన్ని రూపకల్పన చేస్తుంది.
సొంతం చేసుకున్న 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker