All
కోహిర్ ప్రధాన రహదారిపై నూతన వీధి దీపాల ఏర్పాటు
రాత్రి వేళల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు మెరుగైన భద్రత – మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

కోహిర్ ప్రధాన రహదారిపై నూతన వీధి దీపాల ఏర్పాటు
రాత్రి వేళల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు మెరుగైన భద్రత – మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
కోహిర్ ప్రయత్నం న్యూస్
కోహిర్: మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై నూతన వీధి దీపాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల సమక్షంలో వీధి దీపాల ఏర్పాటు పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా రాత్రి వేళల్లో రహదారిపై ప్రయాణించే ప్రజలకు మెరుగైన వెలుతురు అందించడంతో పాటు మహిళలు, చిన్నారులు, వృద్ధులకు భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వీధి దీపాల ఏర్పాటుతో ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.



