తెలంగాణ
సంగారెడ్డి జిల్లాలో జోగిని అనుమానాస్పద మృతి?…. హత్య!
సంగారెడ్డి: జిల్లాలో జోగిని అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. ఇది ప్రణాళిక ప్రకారమే
హత్య ఆని జోగినిలు ఆరోపించారు ఐతే జిల్లాలోని మారేడ్‌పల్లిలో జరిగిన బోనాల జాతరకు జోగినిలు వెళ్లారు వీరితో
పాటు జోగిని దీపికా వెళ్లింది. ఆమె అనుమానాస్పదంగా మృతిచెందడంతో ఆమె
హత్యపై జోగినులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జోగిని మృతదేహాన్ని
మారేడ్‌పల్లి నుంచి గాంధీ ఆస్పత్రి మార్చురీకి అంబర్పేట్ పోలీసులు తరలించారు.
జోగిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకురావడంతో అక్కడకు పెద్దఎత్తున ట్రాన్స్‌జెండర్స్
చేరుకుని నిరసన తెలిపారు.కాగా దీపికాను సాయిహర్ష అనే వ్యక్తి నమ్మించి హత్య చేసి ఉంటాడని
జోగినిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకుడిని తప్పించడానికి పోలీసులు, లింగంపల్లిలోని
ఓ హాస్పిటల్ వైద్యులు ప్రయత్నిస్తున్నారని జోగినిలు ఆరోపించారు.ఒక ప్రణాళిక ప్రకారమే జోగిని
దీపికాను సాయిహర్ష హత్య చేశారని వారు అంటున్నారు. దీపికా మృతదేహాన్ని నాగోల్‌లోని సాయిహర్ష
ఇంటివద్దకు తీసుకు వెళ్లి ధర్నా చేస్తామని జోగినిలు ఆందోళన వ్యక్తం చేశారు.


