సోనియా , రాహుల్ గాంధీలకు భారీ షాక్

సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్‌లో ఉన్న యంగ్ ఇండియన్
ఆఫీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED సీల్ వేసింది. మనీల్యాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం
సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా
ఆఫీస్ ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో..
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజాగా న్యూఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్‌లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్
ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్‌కు సీల్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన
అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు
తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ నివాసాల
వద్ద భద్రతను పెంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను
మోహరించారు. అటు మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం ఇప్పటికే రాహుల్ నివాసానికి
చేరుకున్నారు. ఇందులోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాల ఉన్నాయి.
ఇక హెరాల్డ్ హౌజ్ సీల్‌కు సంబంధించి ఈడీ తరపున స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.




