ఇక వర్మ టార్గెట్ అంతా బ్రూస్లీపైనేనా…?

అయితే ఇలాంటి వివాదాస్పద చిత్రాలు తీయడం వల్ల ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో కోర్టుకు ఎక్కడం సెన్సార్ సమస్యలు ఇవన్నీ తనకి మామూలు అయిపోయాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఈ రోజు మధ్యాహ్నం ఆ సినిమాకి సంబంధం లేని పోస్టర్ ను విడుదల చేసి హాట్ టాపిక్ గా మారారు.
ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో సినిమాను అనౌన్స్ చేశారు వర్మ. ఈ సినిమా టైటిల్ వర్మ అభిమానించే బ్రూస్లీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఎంటర్ ది డ్రాగన్ అనే టైటిల్ కు తనదైన శైలిలో మార్పులు చేసినట్లుగా చెప్పాలి. ఈ సినిమా తన కెరీర్ లోనే ప్రతిష్ఠాత్మక మూవీగా ఆయన పోస్టు చేశారు. తెలుగులో తొలి మార్షల్ ఆర్ట్స్ మూవీగా పేర్కొన్నారు.
ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 3.12 గంటలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి కారణం చెబుతూ.. బ్రూస్లీని అమితంగా ఇష్టపడి అమితంగాప్రేమించిన అమ్మాయి కథగా పేర్కొంటూ.. అందుకే బ్రూస్లీ గర్ల్ గా ట్యాగ్ లైన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సినిమాను ఇండియా చైనా సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. బ్రూస్లీ పుట్టినరోజు కానుకగా ఈ రోజు టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీనికి ముందుగా పోస్టర్ ను విడుదల చేసి బజ్ క్రియేట్ చేశారు. ఈ చిత్ర అంతర్జాతీయ ట్రైలర్ ను బ్రూస్లీ సొంత పట్టణమైన చైనాలోని పోషన్ సిటీలో డిసెంబరు 13న విడుదల చేయనున్నారు.




