నాకు సోషల్ డ్రామా సినిమాలు అంటే చాలా ఇష్టం…“ఉర్వశివో రాక్షసివో” హీరో అల్లు శిరీష్ ఇంటర్వ్యూ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా ‘విజేత’ సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో జీఏ-2 పిక్చర్స్ ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ ఎం సహనిర్మాత గా వ్యవహారించారు.నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర హీరో అల్లు శిరీష్ మీడియా పాత్రికేయ మిత్రులతో ముచ్చటించారు.
చాలా గ్యాప్ తరువాత సక్సెస్ అందుకున్నారు. ఈ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
ఈ సినిమా విడుదల అయ్యే రోజువరకు చాలా టెన్షన్ పడ్డాను. సినిమా చూసిన అందరూ బాగుందని చెప్పడంతో నాకు చాలా రిలీఫ్ అనిపించింది.
శ్రీ కుమార్ క్యారెక్టర్ లో బాగా లీనమయ్యి నటించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
రియల్ లైఫ్ క్యారెక్టర్ ను తీసుకొని సినిమా చెయ్యాలని డైరెక్టర్ ఈ పాత్రను సెలెక్ట్ చెయ్యడం జరిగింది. ఈ క్యారెక్టర్ కొరకు నేను డైరెక్టర్ గారు చాలా రోజులు వర్క్ షాప్ లో బాడీ లాంగ్వేజ్, లుక్ ను డెవలప్ చేయడంతో నా పాత్రలో లీనమై నటించాను.
ఒక్క క్షణం తరువాత ఇంతకాలం గ్యాప్ రావడానికి కారణమేంటి?
జెర్సీ, పక్కా కమర్శియల్, గని ఈ మూడు సినిమాలు మా బ్యానర్ లో మా కన్నా ముందే స్టార్ట్ అయ్యాయి.అవి రిలీజ్ అయ్యాయి. అయితే మంచి డేట్ కోసం ఎదురు చూసి ఇప్పుడు మా సినిమా రిలీజ్ చేశాము.
మీరు ఈ రీమేక్ ను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి?
ధీరజ్ గారు వచ్చి మంచి కాంటెంపరీ స్టోరీ చూశాను చాలా టిఫికల్ గా ఉంది. ఇప్పటి యూత్ ఎలా ఉంటున్నారు అనే సబ్జెక్టు చాలా యూనిక్ గావుంది. చిన్న బడ్జెట్ లో కొత్త కుర్రాళ్ళతో చాలా బాగా తీశారని .ఈ కథ నీకైతే బాగా సూట్ అవుతుందని ఎగ్జైటింగ్ చెప్పడంతో నేను ఈ సినిమా చూశాను.దాంతో డైరెక్టర్ రాకేష్ శశి కి కూడా ఈ సినిమా నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాము.
తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా ?
పాయింట్ స్టోరీ అయితే డీవేట్ కాలేదు. కానీ తెలుగు ప్రేక్షకులు థ్రిల్లర్ అయితే చూస్తారు కానీ మిగిలిన సబ్జెక్టు లకు ఎంటర్టైన్మెంట్ డోస్ లేకుండా చెప్పలేము. అందుకే ఒరిజినల్ లో లేని కామెడీ సీన్స్ యాడ్ చేశాము, అలాగే స్క్రీన్ ప్లే, ఇలా కొన్ని మార్పులు చేశాము.
ఇలాంటి రొమాన్స్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు అలవాటు అవ్వలేదు అనుకుంటున్నారా?
అవ్వలేదు అనను. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఓటిటి సినిమాలు చూస్తున్నారు. అందులో చాలా బూతులు, స్కిన్ షో లు అంతకు మించి ఓటిటి లో చూసి ఉంటారు. అయితే మేము ఆలా చూయించ లేదు. మా సినిమా అంతా పొయేటిక్ గా ఉంటుంది.
సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉన్నా టీజర్, ట్రైలర్ లలో రొమాన్స్ ఉన్న కంటెంట్ ను ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణమేంటి?
ఆలా చూపిస్తే రెగ్యులర్ పార్టన్ లా ఉంటుంది. అయితే కొంత డిఫరెంట్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నాము. అయితే సినిమాలో బాయ్, గర్ల్ మధ్య జరిగే సీన్స్ కూడా ఎక్కువగా ఉండడం తో రివీల్ చేయలేదు.
ఇందులో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అనే నేర్వస్ నెస్ వుండిందా?
లేదు..రాకేష్ కూడా చాలా సెన్సీబుల్ పెర్సన్, షూట్ చేసిన తరువాత మానిటర్ లో చూసుకొని ఇబ్బంది ఉన్న సీన్స్ ఉంటే కరెక్షన్ చేసుకునేవాళ్ళము
ఈ సినిమాలో మీ యాక్టింగ్ లెవెల్స్ చాలా మెచూర్డ్ కనిపించాయి దీనికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు?
ఎక్సపీరియన్స్ సెల్ఫ్ అనాలసిస్, నేను నమ్మిన డైరెక్టర్స్ దగ్గరికి వెళ్లి ఏం చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అడిగి వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని చేయడం జరిగింది.
ప్రి రిలీజ్ ఫంక్షన్ లో బాలకృష్ణ గారు కూడా నీ పెళ్లి గురించి అడిగారు?ఇంట్లో మీ అమ్మ, నాన్ కూడా పెళ్లి విషయంలో ప్రెజర్ పెట్టారా?
ఒక్కోసారి అలాంటి సీన్స్ సెట్ చేసినా సెట్ కావు కానీ ఆ రోజు బాలకృష్ణ సార్ తో ఆలా చాలాసేపు మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే పెళ్లి విషయంలో ఇంట్లో వారు అప్పుడప్పుడు ఆడగుతారు కానీ ఫోర్స్ చెయ్యరు.
సినిమా చూసిన తర్వాత మీ డాడీ ఎలా రెస్పాండ్ అయ్యారు?
మా డాడీ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో నువ్వు అచ్చం శ్రీ కుమార్ లా చాలా బాగా చేశావు. ఇంతకు ముందు నువ్వు చేసిన సినిమాలు ఆలా అనిపించలేదు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని హ్యాపీ ఫీల్ అయ్యారు.




