జాతీయ వార్తలు
ముగిసిన సోనియా విచారణ.. మళ్లీ సోమవారం విచారణ….

నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్
అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు. తదుపరి విచారణకు ఆమె సోమవారం మరోసారి
రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఉదయం 11 గంటలకు సోనియా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి
చేరుకున్నారు. సోనియా వెంట ఆమె తనయుడు రాహుల్ గాంధీ , కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా
, ఈడీ కార్యాలయానికి వచ్చారు. సోనియా ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే
కోలుకుంటుండటంతో సోనియా వెంట ప్రియాంకను కూడా ఈడీ భవనంలోకి అనుమతించారు.
అయితే ప్రియాంకను సోనియాను ప్రశ్నించిన గదిలోకి మాత్రం అనుమతించలేదు. మనీ లాండరింగ్
నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద సోనియా వాంగ్మూలాలను ఈడీ అధికారులు
నమోదు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీల ఫై, ప్రశ్నించారు.




