
తమిళ వైవిధ్య నటుడు విక్రమ్ ‘కోబ్రా’ చిత్రం శరవేగంగా నిర్మాణం అంతుంటే కారోనా వైరస్ కాస్త బ్రేకులేసినట్టు కనిపిస్తోంది. 7 స్క్రీన్ స్టూడియో లలిత్ కుమార్, వయాకామ్ 18 స్టూడియోలు సంయుక్తంగా నిర్మిస్తన్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం రష్యాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా, షూటింగ్ మధ్యలోనే విరమించి తిరిగి వస్తోంది. . ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ట్వీట్ చేశారు, “భారత ప్రభుత్వం విసాలపై తీసుకున్న నిషేధ నిబంధనల కారణంగా రష్యాలో కోబ్రా చిత్రాన్ని ఆపేసి వెనక్కి వస్తున్నామని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ చిత్రంలో నటుడిగా తమిళ అరంగేట్రం చేస్తుండగా, కెజిఎఫ్‌లో నటించిన శ్రీనిధి శెట్టి కథానాయిక. అలాగే దర్శకుడు కె.ఎస్.రవికుమార్, మిర్నాలిని రవి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు . ఎట్టి పరిస్థితిలోనూ మేలో విడుదల చేస్తామని చెపుతున్న చిత్ర యూనిట్ ఈ చిత్రం కోసం హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోకి షిఫ్టయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.



