
వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన‘. శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను పరిచయం చేస్తూ నిర్మితమవుతున్న ఈ సినిమా టీజర్, పాటలు విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విక్టరీ వెంకటేశ్ విడుదలచేశారు.
ఈ సందర్భంగా.. విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ – . ఎపుడైనా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సాలిడ్ స్క్రిప్ట్ తో వచ్చే సముద్ర. దర్శకత్వం వహించిన ‘జైసేన’ ది పవర్ ఆఫ్ యూత్ మూవీ ట్రైలర్ ఇప్పుడే చూశాను . ఒక మంచి స్క్రిప్ట్ చూసానని అనుభూతి కలిగింది. శ్రీకాంత్, సునీల్ తో పాటు చాలా మంది నటించారు. ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – “ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. అందరి హీరోల అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘జైసేన’. అన్నారు
నటుడు శ్రీ కార్తికేయ ప్రవీణ్ కుమార్ , అభిరామ్, హరీష్‌గౌతమ్ తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.



