Allసినిమాలు

బోయ్స్ పై అంచనాలుంటాయి! – నిధి అగర్వాల్

సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన అందాలభామ నిధి అగర్వాల్. ఆ చిత్రంతో నటిగా, డాన్సర్ గా మంచి మార్కులు తెచ్చుకున్నారు.  మలి చిత్రంగా యూత్ కింగ్ అఖిల్ తో మిస్టర్ మజ్ను సరసన నటించింది. తెలుగులో ఇది సెకండ్ మూవీనే అయినా, ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది నిధి.  వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన మిస్టర్ మజ్ను చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఇదిలా ఉండగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

నిధి మాట్లాడుతూ  మజ్ను సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతృప్తినిచ్చింది.  నా పర్ఫామెన్స్ చూశాక, మా పేరెంట్స్ నువ్వింత బాగా నటిస్తావా..? అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు అన్నారు. అది నా లైఫ్ లో బెస్ట్ కాంప్లిమెంట్. నాగ చైతన్య, అఖిల్.. ఇద్దరితోనూ పని చేసే అవకాశం నిజంగా అదృష్టంగా ఫీలవుతున్నా. అసలు ఇద్దరికీ ఎందులోనూ పోలిక ఉండదు. ఒకరు నీరైతే ఇంకొకరు నిప్పు అన్నంత తేడా ఉంటుంది ఇద్దరిలో. కానీ ఇద్దరూ చాలా క్రమశిక్షణతో ఉంటారు. సినిమాలోని ఎమోషనల్ సీన్స్ లో నటనకు పేరొచ్చింది. నేను పుట్టింది హైదరాబాద్ లోనే కాబట్టి నాకు తెలుగు మాట్లాడటం అంత కష్టంగా లేదు. ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో కొత్తగా వింటున్న భాష లా నాకు అనిపించలేదు. ఇదే నా కరియర్ బిగినింగ్ కాబట్టి ఇంకా నేను నాకు నచ్చిన రోల్సే చేసే స్టేజ్ కి వచ్చానని అనుకోవట్లేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ తరవాత, డిఫెరెంట్ రోల్స్ పై దృష్టి పెడతా. డ్యాన్స్ ఓరియంటెడ్ సినిమా చేయాలని ఉంది. పూరి జగన్నాథ్ గారి దర్శకత్వ ంలో నటిస్తున్నందుకు చాలా హ్యాప్పీ. ఆ రోల్ గురించి డిస్కస్ చేయడం ఇప్పుడే కరెక్ట్ కాదేమో. కానీ చాలా కొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నా. అర్జున్ రెడ్డి’ సినిమా 4 సార్లు చూశాను. ఒకవేళ అవకాశం దొరికితే ఆ సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ రోల్ లో నటించాలని ఉంది” అని తెలిపారు.

నెగెటివ్ కామెంట్స్ ని కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటా. కానీ ఆ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనేది మాత్రం డెఫ్ఫినెట్ గా మ్యాటర్స్. కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ పర్సన్స్ నుండి వచ్చిన కామెంట్స్ నే పట్టించుకుంటా. ‘మిస్టర్ మజ్ను’ కి మాత్రం 95% పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. ఇంకా ఏం కావాలి… అని ఇంటర్వ్యూ ముగించింది నిధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker