టాప్ మోడల్, నటి నేహా మాలిక్ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న తీరుకు యువతరం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అమ్మడు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో .. వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వారసురాలిగా ఈ అమ్మడు కూడా పంజాబీ నుంచి సౌత్ కి ఇంపోర్ట్ అయ్యే పనిలో ఉందిట. ఆ క్రమంలోనే నేహా ఫోటో షూట్లతో దాడి చేస్తోంది. 2012లో అరబ్ ఫ్యాషన్ వీక్ తో ఈ అమ్మడి పాపులారిటీ రెట్టింపైంది. అటుపై టీవీ- పంజాబీ సినిమాల నటిగానూ పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలోనూ నేహా మాలిక్ కథానాయికగా ప్రయత్నాలు సాగిస్తోందిట. మన నిర్మాతలు అవకాశాలివ్వాలే కానీ, గ్లామర్ షోకి ఏమాత్రం అభ్య ంతరం చెప్పదని సిగ్నల్స్ ఇస్తోంది.
Related Articles
టిడిపి సభ్యుల సస్పెన్షన్
January 20, 2020
Check Also
Close - ఈరోజు కోర్ట్ లో హాజరు కానున్న జగన్January 10, 2020



