All
గోడ మీద వార్తలు
01 కనుమ సందర్భంగా మాంసాహార దుకాణాల దగ్గర బారులు తీరిన జనం …
సూత్తా ఉండండి – ఈళ్ళే సాయంత్రం జీవకారుణ్య పోష్టులెడతారు సోషల్ మీడియాల్లో…!!
02. పశ్చిమ బెంగాల్ లో భాజపా రథయాత్రకి నో చెప్పిన – సుప్రీం కోర్టు …
పొడిచేస్తాం – తుడిచేస్తాం – అని కేకలేయకుండా అడిగుంటే అనుమతొస్తాది గానీ – కేకలేస్తే పనులెట్టా అవుతాయ్…!!
03. వైసీపీ కి ఈ రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేనప్పుడు ఇక్కడెలా పోటీ చేస్తారు – చంద్రబాబు …
నలభై ఏళ్ళ అనుభవం పెట్టుకుని ఈ సిల్లీ కొశ్చనేటి సామీ – ఎట్టా పోటీ చేస్తారేటి – అందరిలానే నామినేషనేసి…!!
04. కాంగ్రేస్ , భాజపేతర ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు కోసం నేడు జగన్ ని కలవనున్న కేటీఆర్ …
భాజపేతర అనే మాట విన్నవాడంత వెర్రిపుష్పం – నమ్మినోడంత నయాపుష్పం మరొకడుండడు…!!
05. తెదేపాకి సంబంధం లేని అంశం లేవనెత్తి వైయస్ షర్మిళ తెదేపా పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు – చంద్రబాబు …
మీ దగ్గర పవరుంది కాబట్టి ఎన్నికల ముందర వరాలుజల్లారు – ఆళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆళ్ళ దగ్గరున్నది జల్లుతన్నారు – దాంట్లో వింతేముంది .. !!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!
“
తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”
తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”


