All
ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కోసిగి, జనవరి 07: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కోసిగిలో జరిగే జన్మభూమి కార్యక్రమానికి రానున్న సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సోమవారం సభా ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడినుంచి ఎస్సీ కాలనీలో పర్యటించి పారిశుభ్రతపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభాస్థలిని , ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు. ఎటువంటి లోపాలు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు.



