Allజాతీయ వార్తలు
ట్రంప్‌కు ఘనస్వాగతం పలికిన మోదీ

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు చేరుకున్నారు. భార్యా మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రతినిధుల బృందంతో ఆదివారం భారత్‌కు బయల్దేరారు ట్రంప్ బృందం. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఉదయం 11.45 గంటలకు అహ్మదాబాద్ విమాశ్రయం చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్‌కు కుటుంబసభ్యులకు ప్రధాని నరేంద్రమోదీ ఘన స్వాగతం పలికారు. విమానం నుంచి దిగిన ట్రంప్‌ను మోదీ ఆలింగనం చేసుకుని ట్రంప్‌కు ఘనస్వాగతం పలికారు.




