All
బలవంతపు పెళ్లి చేసిన తల్లి

ఓ మైనర్ బాలికకు ఆమె తల్లి బలవంతపు పెళ్లిచేసిన విషయంపై బాలిక తండ్రి ఖమ్మం వన్‌టౌన్ పోలీసులను, చైల్డ్‌వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. నగరానికి చెందిన ఓబాలిక తల్లిద oడ్రులు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. వారి కూతురు(16) తల్లి దగ్గరే ఉంటోంది. ఆ బాలిక ఓ యువకుడిని ప్రేమించగా తండ్రికి తెలియ కుండా బాలిక తల్లి వారిద్దరికీ వివాహం జరిపించి జగిత్యాలకు తరలించింది. ఈ విషయంపై బాలిక తండ్రి వన్‌టౌన్ పోలీసులు, చైల్డ్‌వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో వారు తల్లిని, బాలికను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఈ వివాహానికి కారకులైన సుమారు పదిమందితో పాటు వివాహం చేసుకున్న బాలిక తరఫు పెద్దమనుషులను పిలిపించి వారిలో ఆరుగురికి కులాచారం ప్రకారం ఒక్కొక్కరికి రూ.1100 చొప్పున జరిమానా విధించినట్లు బాలిక తండ్రి ఆరోపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



