ఆంధ్రప్రదేశ్

1-బీ లో పేరుంటే చుక్కల భూముల క్రమబద్ధీకరణ…రెవెన్యూశాఖ.

పంటల సాగుకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఈ-క్రాప్‌ బుకింగ్‌పై రెవెన్యూశాఖ కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
భూ రికార్డుల ఆన్లైన్ ప్రక్రియ మార్గదర్శకరణం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది అసైన్ దేవాదాయ సాదాభాయి నమోదు ఇలాంటి భూములు పై పూర్తి అవగాహనతో గైడ్లైన్స్ ఇచ్చింది ఈ క్రాప్‌ బుకింగ్‌ కోసం రెవెన్యూ, వ్యవసాయశాఖలు ఖరీఫ్‌, రబీ, మూడో పంటకు సంబంధించిన గణాంకాల సేకరణ,
 రికార్డుల తయారీకి ఉమ్మడి అజమాయిషీ చేపట్టేలా లోగడ ఉత్తర్వులు ఇచ్చారు. ఏ భూముల విషయంలో ఎలా
స్పందించాలి? రికార్డుల నమోదు ఎలా ఉండాల్నో దిశానిర్దేశం చేస్తూ మరికొన్ని అంశాలపై స్పష్టత ఇస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ జి. సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చుక్కల భూములకు సంబంధించి.. 1బీ రిజిస్టర్‌లో పట్టాదారు పేరును చూపిస్తే ఆ భూమిని ఆ వ్యక్తి పేరిట చుక్కల భూముల చట్టం, రూల్స్‌ మేరకు క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తులు స్వీకరించాలి. ఉమ్మడి అజమాయిషీలో రెవెన్యూ విభాగం ఈ వివరాలను సేకరించాలి. వ్యవసాయ శాఖ ్ల పంటలు, సాగుదార్ల పేర్లను రికార్డు చేయాలి.
* అసైన్డ్‌ చట్టం ఉల్లంఘనల వివరాలను కూడా ఉమ్మడి అజమాయిషీలో నమోదు చేయాలి. ఆ భూములు ఎవరికి కేటాయించారు?
 ఏం పంట పండిస్తున్నారో రికార్డుచేయాలని వ్యవసాయశాఖను ఆదేశించారు.
 * దేవదాయ, వక్ఫ్‌భూములకు సంబధించి అధికారిక లీజుదారుల పేర్లే నమోదు చేయాలి.
 * అటవీ భూముల విషయంలో సర్వే-ఎ్‌సడీ నంబర్ల వారీగా సాగు వివరాలను రికార్డుల్లోకి ఎక్కించాలి. ఇప్పటికే
  డిజిటలైజ్‌ చేసిన రికార్డులకు డైరెక్ట్‌గా సర్వే నంబర్లు ఉన్నందున ఆ వివరాలను నమోదు చేయాలి.
* సాదాబైనామా, మ్యుటేషన్‌ పెండింగ్‌ ఉన్న కేసుల్లోనూ సాగుదారులు, పంటల వివరాలు నమోదు చేయాలి.
ఈ-క్రాప్‌ అప్లికేషన్‌లో కౌలుదారుల పేర్లు నమోదు చేయాలి. ఈ సందర్భంగా సీసీఆర్‌సీ కార్డులు అవసరం ఉన్న చోట
 11 నెలల పాటు చెల్లుబాటయ్యేలా వీఆర్‌ఓ జారీ చేయవచ్చు. రైతులు కౌలు గుర్తింపుకార్డులు తీసుకునేలా ప్రోత్సహించాలి.
 * ఎవరైనా ప్రభుత్వ భూములన ఆక్రమించుకొని సాగుచేస్తుంటే ఆ వివరాలను నమోదు చేయాలి.
  * ఈ క్రాప్‌పై సెప్టెంబరులో సోషల్‌ ఆడిట్‌ నివేదిక ప్రకటించాలని, ఆ తర్వాత సెప్టెంబరు 1 నుంచి 14 వరకు ఫిర్యాదులు,
అభ్యంతరాలను స్వీకరించాలని, 15న తుది నివేదిక ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ
 చట్టం( వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపు) ప్రకారం సాగు భూమిని సాగేతర అవసరాలకు మళ్లించేందుకు నాలా ఫీజులు
చెల్లించాల్సి ఉంటుంది. అలా ఫీజులు చెల్లించిన తర్వాత తిరిగి ఆ భూముల్లో సాగు చేసుకుంటామంటే చట్టం అనుమతించదని
, ఫీజులు తిరిగి చెల్లించడం సాధ్యంకాదని రెవెన్యూశాఖ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker