All

తెలుగు నాట వినిపిస్తోన్న ఓ హాట్ హాట్ గాసిప్ ఏంటంటే…

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎలా చెబితే అలా నడచుకోవాల్సిందే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయినా. ఎందుకంటే, కోట్లు గుమ్మరించి ఆయన్ని కేసీయార్, జగన్ తమ రాజకీయ అవసరాల కోసం ‘సలహాదారు’గా నియమించుకున్నారు కదా.!

ప్రజలు ఓట్లేస్తే, రాజకీయ పార్టీలు గెలవడం అన్నది వెనకటి మాట. ఆ ప్రజలతో ఓట్లేయించి, ఆయా రాజకీయ పార్టీలకు ‘వ్యూహకర్తలు’ విజయాలు అందించడం అనేది నేటి మాట. ప్రజలు ఏవేవో అనుకుంటారు. అలా ప్రజలు అనుకోకుండా, ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయడం అనేది ఈ వ్యూహకర్తల పని.
2019 ఎన్నికల్లో ప్రజల మెదళ్ళను గందరగోళానికి గురిచేసి, వైసీపీ వైపు మెజార్టీ ఓట్లు పడేలా చేయడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పక్కాగా పని చేశాయి. కోడి కత్తి డ్రామా, బాత్రూమ్‌లో బాబాయ్‌కి గొడ్డలి కారణంగా వచ్చిన గుండెపోటు.. ఇలాంటివన్నీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలేనంటారు.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల పంచాయితీ సంగతేంటి.? ఎవరేమనుకుంటున్నారు.? తాజాగా తెలుగు నాట వినిపిస్తోన్న ఓ హాట్ హాట్ గాసిప్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిందేనని అటు కేసీయార్ పైనా ఇటు జగన్ పైనా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒత్తిడి తెస్తున్నారట.
గెలవాలంటే, ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం తప్పనిసరి.. అని ప్రశాంత్ కిషోర్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకీ తేల్చి చెప్పేశారట. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది.. విపక్షాలేవీ ఎన్నికలకు సన్నద్ధంగా లేవు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్ళడమే మంచిది.. అన్నది ప్రశాంత్ కిషోర్ తాజాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చిన నివేదిక తాలూకు సారాంశమట.
ఇంతకీ, కోడి కత్తి తరహాలో కొత్త డ్రామాలు తెలుగునాట ప్రశాంత్ కిషోర్ ఏమైనా సిద్ధం చేసుకున్నారా.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker