Allరాశిఫ‌లాలు

ఈరోజు రాశిఫలాలు


మేషం – వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తుల ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్‌లకు మార్గం సుగమం అవుతుంది. అధికారుల ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. మీ ప్రమేయం లేకున్నా కొన్ని విషయాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీపై అభియోగాలు తొలగిపోగలవు. రోజువారీ ఖర్చులే ఉంటాయి.
 
వృషభం -భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకోగల్గుతారు. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. వృత్తిపరంగా ప్రజాసంబంధాలు బలపడతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. మీకు తెలియకుండానే పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది.
 
మిథునం -నూతన పెట్టుబడులు, సంస్థలు, ప్రాజెక్టుల స్థాపనలకు మరి కొంత కాలం ఆగటం మంచిది. బంధుమిత్రుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. సంతానం విద్యా విషయాలపై శ్రద్ధ వహిస్తారు. రుణాలు తీర్చి తాకట్టు విడిపించుకుంటారు.
 
కర్కాటకం -అధికారులు అభియోగాలు, వ్యతిరేకత ఎదుర్కుంటారు. వ్యవహార ఒప్పందాల్లో కచ్చితంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా పాటించటం ఉత్తమం. పనులు వాయిదా వేసిన ఇబ్బందులకు గురవుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. తాకట్టుపై రుణాలు స్వీకరిస్తారు. మీ యత్నాలు గుట్టుగా సాగించండి.
 
సింహం -విలాస వస్తువుల కొనుగోలుకు ధనం బాగా వ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు కావలసిన వనరులు, లైసెన్సులు సమకూర్చుకుంటారు. ఆడిటర్లు, అక్కౌంట్స్, కంప్యూటర్ రంగాలవారికి చికాకులు అధికం. ప్రయాణాల్లో మెలకువ వహించండి. సభలు, సమావేశాలు వాయిదా పడే సూచనలున్నాయి.
 
కన్య -పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. అధికారులకు మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. ఎల్.ఐ.సి, ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఒక పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది.
 
తుల -కార్యసాధనలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఖర్చులు సామాన్యం. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, బాధ్యతల్లో చికాకులు అధికం. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం – ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులకు తగిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు.

ధనస్సు- ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు సంభవం. మీ సమర్థతకు గుర్తింపు లభించక నిరుత్సాహం చెందుతారు. లైసెన్సుల రెన్యువల్, లీజు పొడిగింపుల్లో అశ్రద్ధ తగదు. అయిన వారితోనైనా కచ్చితంగా ఉండాలి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, తగిన అవకాశం కలిసివస్తుంది. నిరుద్యోగులు ఆశాదృక్పథంతో యత్నాలు సాగించాలి.
 
మకరం – ఒక సమస్య పరిష్కారం కావటంతో మనసు తేలికపడుతుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రులకు మీపై మరింత అభిమానం కలుగుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. షాపుల స్థలమార్పిడి. గృహ వాస్తుదోష నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి.
 
కుంభం – అధికారుల ఇంటర్వ్యూ అనుకూలించదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీ సంతానం కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్థిరాస్తి విక్రయంలో ఆటంకాలు తొలగిపోగలవు. వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా పూడ్చుకుంటారు. మీ గౌరవానికి భంగం కలిగించే సూచనలున్నాయి.
 
మీనం- ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. దేనిపైనా మనస్సు లగ్నం చేయలేరు. కోర్టు వాయిదాలకు  హాజరవుతారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker