తెలంగాణముఖ్యాoశాలు
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో సాదుద్దీన్ సహా.. నలుగురు మైనర్ నిందితులకు ఉచ్చు బిగుస్తోంది

జూబ్లీహిల్స్‌లో విదేశీ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ సహా.. నలుగురు
మైనర్ నిందితులకు ఉచ్చు బిగుస్తోంది. తొలినాళ్లలో వ్యక్తమైనా.. నగర పోలీస్ కమిషనర్ సీవీ
ఆనంద్ తొలిరోజు నుంచే ఈ కేసుపై దృష్టి సారించి.. . రెండ్రోజుల్లో చార్జిషీట్ దాఖలుకు పోలీసులు
సిద్ధమవుతుండగా.. ఫోరెన్సిక్ నివేదికలతో నిందితులకు కఠిన శిక్షలు తప్పవని తెలుస్తోంది.
ముఖ్యంగా గ్యాంగ్‌రేప్ జరిపిన కారులో సేకరించిన నమూనాలు, టిష్యూ పేపర్లపై వీర్యం మరకలు,
బాధితురాలి స్కర్ట్‌పై లభించిన వీర్యం నమూనాలు, తల వెంట్రుకలు, తినిపారేసిన చూయింగమ్
వంటివి ఐదుగురు నిందితుల నేరాన్ని నిరూపిస్తోందని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్(ఎస్‌ఎఫ్‌ఎల్) నివేదిక
స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నిందితుల డీఎన్‌ఏతోపాటు.. సీసీటీవీ ఫుటేజీ, కాల్‌డేటా, సెల్ టవర్
లొకేషన్, ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో బాధితురాలు నిందితులందరినీ గుర్తించడం.. పోక్సో కేసు కావడం
వంటి అంశాలు సాదుద్దీన్ సహా..నలుగురికీ 20 ఏళ్ల చొప్పున శిక్షలు పడే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు



