తెలంగాణముఖ్యాoశాలు

అక్షరాలా పది లక్షల కెమెరాల అనుసంధానం

ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం
రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు
అక్షరాలా పది లక్షల కెమెరాల అనుసంధానంతో.. రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా క్షణాల్లో కనిపెట్టి అక్కడి పోలీసు
అధికారులను అప్రమత్తం చేసే నిఘా నేత్రం తెరుచుకోవడానికి రంగం సిద్ధమైంది! రూ.600 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురువారం మధ్యాహ్నం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ భవనాన్ని ప్రారంభించారు. సీఎంతో పాటు హోంమంత్రి, ఇతర మంత్రులు, రాజకీయ ప్రముఖులు,
డీజీపీ, అదనపు డీజీపీలు, సీపీలు, జిల్లా ఎస్పీలు, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు, భవన నిర్మాణం చేపట్టిన ఆర్‌అండ్‌ బి
అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2016 నవంబర్‌ 22న ప్రారంభమైన
కమాండ్‌ కంట్రోల్‌ భవన నిర్మాణ పనులు పూర్తవడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. గతంలో రెండుసార్లు ప్రారంభోత్సవానికి
ప్రణాళికలు రచించినప్పటికీ.. నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఇప్పుడు అందుబాటులోకి
వస్తోంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ మరింత పటిష్ఠమవుతుందని… పోలీస్‌ సిబ్బందికి కొత్త శక్తి చేకూరుతుందని.
. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, నేరగాళ్లపై చర్యల వంటి అంశాల్లో ఎంతో పురోగతికి అవకాశం ఉంటుందని పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker