All
నల్గొండ కస్తూరిబా పాఠశాలలో 17 మందికి కరోనా పాజిటివ్
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని నేరేడు బొమ్మ కస్తూరిబా పాఠశాలలో కరోనా కలకలం
రేగింది విద్యార్థులు 20 మంది వరకు దగ్గుతూ జ్వరంతో బాధపడటం చూసిన ఉపాధ్యాయురాలు వెంటనే
వారిని అప్రమత్తం చేసి పరీక్షలు చేపించగా 16 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్గా
నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు దీంతో ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి
సమాచారం అందించారు




