తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. దాసోజు శ్రవణ్ రాజీనామా

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీకి కీలక నేత దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తో ప్రారంభమైన రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు.
ఆ తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పార్టీ మారుతారేమోననే ప్రచారాన్ని
బలపరిచేలా ఉన్నాయి. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి చేరికపై దాసోజు
శ్రవణ్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో నేడు ఆయన తన రాజీనామాను ప్రకటించారు. మరికాసేపట్లో కేంద్ర హోం
మంత్రి అమిత్ షాను కోమటిరెడ్డి బ్రదర్స్ కలవనున్నారు. పార్టీ మారుతున్నది రాజగోపాల్‌రెడ్డి అయితే ఆయనతో
పాటు వెంకటరెడ్డి కూడా కలవనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. శుక్రవారం అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు.
మొత్తానికి ఈ భేటీ అనంతరం వెంకటరెడ్డి నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.




