All

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అడ్డు వస్తే అంతే…..

నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా పెండింగ్ చలానాలు చెల్లించకుండా దాదాపు పది సంవత్సరాలు గడిపేసి వాహనానికి
ఒక్క పేపర్ కూడా లేకుండా నిర్మొహమాటంగా తిరిగిస్తూ పోలీసులకు చిక్కిఅభాసుపాలు అవుతున్న సంఘటనలు చాలా
జరిగాయి అయితే గురువారం జరిగిన ఒక సంఘటన ప్రజలను అధికారులను నివ్వరిపోయే విధంగా చేసింది అదేంటంటే
కూకట్పల్లి ట్రాఫిక్ సిఐ బోస్ కిరణ్ తన డ్యూటీలో భాగంగా ట్రాఫిక్ ను సడలించుకుంటూ ఒక బైకు ఆపడం జరిగింది. ఆ బైకు
ఓం ప్రకాష్ అనే వ్యక్తి అతడు బైకు ఆపిన వెంటనే దిగి ఏం కావాలి అని అడగడంతో పెండింగ్ చలానాలు కట్టమని  బండికి
సంబంధించిన పేపర్లను చూపించమని అడగడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. డ్యూటీకి ఆటంకం కలగిస్తూ దాదాపు
రెండు గంటల సేపు ఇబ్బంది పెట్టడంతో ఒకింత ఆవేశానికి వచ్చి చిన్నగా కొట్టడం
జరిగింది. .చేయి చేసుకోవడం అనేది తప్పు కదా అని ట్రాఫిక్ సిఐ ని అడగగా ఆయన ఇచ్చిన సమాధానం ఈ విధంగా ఉంది,
ట్రాఫిక్ డ్యూటీ చేసేటప్పుడు చలానాలు కట్టమని చెప్పి బండి పక్కకు
ఆపి మేము వేరే పని చేసుకుంటామని డబ్బులు వెబ్సైట్లో కట్టి బండి తీసుకొని వెళ్ళిపోవడం ప్రతి ఒక్కరు చేసే పని. కానీ
ఈ వ్యక్తి డబ్బులు కట్టకుండా బండి పేపర్లు లేకుండా పది సంవత్సరాల నుంచి ఎందుకు తిరుగుతున్నారు అని అడిగితే
దానికి సమాధానం చెప్పలేదు ,పైగా నేను అడిగే ప్రశ్నలకు మాట్లాడే మాటలకు ఫోన్లో రికార్డింగ్ చేస్తూ వీడియోలు తీస్తూ నేను
చేసే డ్యూటీకి ఆటంకం కలిగిస్తూ దాదాపు రెండు గంటల సేపు ఇబ్బంది పెట్టడంతో ఒకింత ఆవేశానికి వచ్చి చిన్నగా కొట్టడం
జరిగింది. ఆ వాహనదారుడు దానిని వీడియోలు తీసి యూట్యూబ్లోనూ ఇతర ఛానల్లోనూ పంపించడం జరిగిందని
ఆయన చెప్పారు, నేను కొట్టాలని కానీ అతన్ని ఇబ్బంది పెట్టాలని కానీ ఎక్కడ ఆలోచన లేదని ఎక్కువసేపు డ్యూటీ కి అంతరాయం
కలిగిస్తూ ఫోటోలు తీయడం వల్ల విసుగెత్తి చిన్నగా చేయి చేసుకోవడం జరిగిందని, అంతే తప్ప నేను ఎటువంటి తప్పు
చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు,డ్యూటీకి అంతరాయం కలిగించే వారిపై చర్యలు తీసుకోవచ్చని కానీ కొట్టకూడదని
తెలిసినప్పటికీ ఆ సమయంలో అతను చేసిన పనికి అలా జరిగిందని ఆయన బాధతో చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker