వైఎస్సార్ ఉచిత పంటల బీమా– పీఎంఎఫ్‌బీవై అనుసంధానం

నమోదు ప్రక్రియను ప్రతిరోజు నిశితంగా పరిశీలించాలి
వైఎస్సార్ ఉచిత పంటల బీమా– పీఎంఎఫ్‌బీవై అనుసంధానం
తద్వారా రైతులకు గరిష్టంగా లబ్ధి చేకూర్చేలా చర్యలు
ఖరీఫ్ సీజన్‌లో ఈ–పంట నమోదు పక్కాగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడా చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం ఇవ్వని
రీతిలో వంద శాతం పంట నమోదు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో
వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా
పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో అనుసంధానిస్తూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్
నుంచే అమలు చేస్తున్నందున రైతులకు గరిష్టంగా లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి.
ప్రస్తుత సీజన్‌లో ఎరువుల కోసం ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. ఎరువుల
పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి. – ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ, ఎరువుల
సరఫరా ఇన్‌పుట్స్ పంపిణీ, అందిస్తోన్న సేవలు, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు
తదితర అంశాలపై వ్యవసాయ సహాయకుల నుంచి ప్రతి రోజూ సమాచారం తెప్పించుకోవాలి.
ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్ పని చేసేలా చర్యలు తీసుకోవాలి. వాటికి సవ్యంగా ఇంటర్నెట్ కనెక్షన్
ఉందా? లేదా? అన్న దానిపై నిరంతరం పరిశీలన చేయాలి. అవి సమర్థవంతంగా పనిచేసేలా
చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. – వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా
రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలి. వ్యక్తిగత పరికరాల పంపిణీ కోసం అవసరమైన
ఏర్పాట్లు చేయ్యాలి. – మండలానికి 3 ఆర్బీకేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 2 వేల
ఆర్బీకేల పరిధిలో డ్రోన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.
తొలుత మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలి. 18.8 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు
– ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని అధికారులు
సీఎంకు వివరించారు. ఆగష్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో
36.82 లక్షల హెక్టార్ల మేర పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో
పంటలు సాగయ్యాయని వివరించారు.– ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో
ఉన్నాయని, ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్‌ఫర్‌మేటిక్స్
సెంటర్) ద్వారా ఈ–క్రాప్ నమోదు చేస్తున్నామని, సాగవుతున్న ప్రతి పంటను సాగు విస్తీర్ణంతో
సహా జియో ట్యాగింగ్ చేయడమే కాకుండా, వెబ్ ల్యాండ్‌తో అనుసంధానిస్తున్నామని వివరించారు.


