All
ఏఐసీసీ ఆదేశాల మేరకు పాదయాత్రలు నిర్వహించాలి
75 కిలోమీటర్లు కనీసం 75 మంది ముఖ్యులతో భారీ జాతీయ జెండాలతో……..
ఏఐసీసీ ఆదేశాల మేరకు 9వ తేదీ నుంచి అని జిల్లాలలో అజాది గౌరవ్ పాదయాత్రలు
ప్రారంభించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
ప్రతి జిల్లాలో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యాత్రలు జరగాలన్నారు. కనీసం
75 కిలోమీటర్లు కనీసం 75 మంది ముఖ్యులతో భారీ జాతీయ జెండాలతో అన్ని నియోజక
వర్గాలలో కలిసే విధంగా యాత్రలు నిర్వహించాలని సూచించారు. దేశానికి స్వాతంత్రం
రావడానికి కాంగ్రెస్ నాయకులు చేసిన త్యాగాలు, పోరాటాలు ప్రజలకు వివరించాలన్నారు.
దేశంలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అందించిన అంశాలను వివరించాలని పేర్కొన్నారు.




