All

నేటికీ 20 రోజులు సాహితీ బాధితుల ఆవేదన

ఎవరికి ఎంత వాటా చెప్పేస్తానంటున్న చైర్మన్
గోప్యంగా పోలీసుల విచారణ……వాస్తవం బయటకు పస్తుoదా?.

ఆవేదన  తీరలేదు నేటికీ 20 రోజులు సాహితి బాధితుల గోడు పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు, ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు సాహితీ చైర్మన్ ను విచారణ కోసం పిలిచి విచారణ జరుపుతున్నారు. అనేది బయటకు తెలుస్తున్నవిషయం, కానీ సాహితీ చైర్మన్ దగ్గర నుండి ఎవరు ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఆయన ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఎమ్మెల్యేలకు ఎంత, ఎమ్మెల్సీలకు ఎంత, మంత్రులకు ఎంత, ఎంపీలకు ఎంత, అలాగే స్వామీజీలకి ఎంత, పోలీసులకు ఎంత, అనేది లెక్క  చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. హైదరాబాదులో దాదాపు 7, 8 చోట్ల ఆయన వ్యాపారం చేశారు. చేసిన వ్యాపారం ఎక్కడ లెక్క రాలేదు. దీంతో సాహితీ చైర్మన్ డబ్బులు తీసుకున్న వారికి తిరిగి ఇవ్వలేక, ఫ్రీ లాంచ్ అనే ఒక ఆఫర్ ని పెట్టి దాదాపు 1500 మందికి టోపీ పెట్టే ఆలోచన చేసి తన బాకీలను తనకు పదవిని కొనుక్కునే విధంగా ప్రయత్నం చేశారు కానీ అది బెడిసి కొట్టి ప్రస్తుతం జైలుకు వెళ్లడానికి దగ్గర్లో ఉన్నట్టు పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. గత నాలుగు రోజుల క్రితం నుంచి పోలీసులు విచారణకు పిలిచి విచారణ చేస్తున్నట్టుగా అనిపించినప్పటికీ బయటకు ఏ విషయాలు రాకుండా తొక్కిపట్టేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోవడం, వాటి కోసం అమ్మిన ప్లాట్లను మరల తనకా పెట్టడం, బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం ఇది జరుగుతున్న ప్రయత్నం .సాహితీ చైర్మన్ తను ఏదైతే మొదలుపెట్టి అందర్నీ డబ్బులతో మభ్యపెట్టి పదవులు కొనుక్కుని జల్సాలు చేద్దామంటే ఎలా, ఎంతో కష్టపడి రాత్రులు డ్యూటీలు చేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం అనుకున్న 1500 మంది జీవితాలతోటి ఆడుకున్న సాహితీ చైర్మన్ ఇప్పుడు అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి, దీంతో చేసేది లేక ఎవరికి ఏమి ఇచ్చారు  అనేది లెక్కలు తీస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్రీ లాంచ్ పేరుతోమొదలుపెట్టిన వ్యాపారం అడిగినవారికి అబద్ధాలు చెప్పుకుంటూ తన సర్వే నెంబర్లును, గవర్నమెంట్ సర్వే నెంబర్లును తన నెంబర్ గా చెప్పుకొని భూమి ఉంది అని చెప్పుకుంటూ భ్రమలో బతికిచ్చాడు. ఆయన బ్రతికాడు, ప్రస్తుతం సాహితీ చైర్మన్, సాహితీ ఇన్ఫ్రా లో కొన్న బాధితులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, విచారణను పోలీసులు అతి గోప్యంగా చేస్తున్నారు.వాస్తవం బయటకు వస్తుoదా ?.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker