All
మహిళలకూ.. మొండిచేయి!

మహిళలకూ.. మొండిచేయి! కొత్త చట్టాలు తెచ్చామంటూ ప్రచారం చేసుకోవడం.. మేము మాత్రమే చేస్తున్నామంటూ ఆర్భాటం చేయడం.. ఆపై వాటిని అటకెక్కించడం.. ఇదీ చట్టాల అమల్లో జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి. రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సివిల్ కాంట్రాక్టు పనులు, సర్వీసు కాంట్రాక్టు పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేసింది.వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఏవో కొన్ని చట్టాలు చేసి గతంలో ఎవరూ చేయని చట్టాలను తామే చేశామని ఆర్భాటంగా ప్రకటించుకుంది. కార్పొరేషన్ల పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక చట్టం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పరిశ్రమల్లో 70 శాతం స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇలా పలు చట్టాలు చేశారు. అయితే ఈ చట్టాలు ఏవీ ఆచరణలోకి వచ్చిన దాఖలాలు లేవు. నిధులు, విధులు లేని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వాటికి మాత్రం చైర్మన్లు, డైరెక్టర్ల పదవులిచ్చి హడావుడి చేశారు. మిగతా ఎక్కడా వాటి ఊసే లేదు. మరోవైపు పంచాయతీల సర్పంచ్‌లు గ్రామాల్లో నాటిన మొక్కల్లో 80 శాతం పరిరక్షించలేకపోతే చర్యలు తీసుకుంటామని ఏకంగా చట్టం తెచ్చారు.




