తెలంగాణ
ఖైరతాబాద్ జంక్షన్ సామూహికంగా జాతీయ గీతాలాపన

75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ జంక్షన్ ఉదయం 11:30 గంటలకు పెద్ద సంఖ్యలో హాజరయిన నిర్మాణ రంగ కార్మికులు..పలు కాలేజీల విద్యార్థులు.. జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో జాతీయ గీతం పాడారు. నిమిషం పాటు అన్ని మెట్రో రైళ్లు కూడా నిలిచిపోయాయి. మెట్రో సర్వీసుల్లోనూ అందరూ సామూహికంగా జాతీయ గీతం పాడారు.



