ఫైనల్స్ లో విజయం సాధిద్దాం… సిటీ కమీషనర్ సీవీ ఆనంద్

సిటీ పోలీస్ కమీషనర్ సి వి ఆనంద్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, TSPICCC- బంజారా హిల్స్‌లో అన్ని SHOలు మరియు సిటీ పోలీస్ సీనియర్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ, “జనవరి నుండి వివిధ సంఘాల యొక్క అన్ని పండుగలకు కోవిడ్ తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైనప్పటికీ, అనేక ఇతర కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ శాంతియుతంగా నిర్వహించబడ్డాయి. అవన్నీ క్వార్టర్ ఫైనల్స్ మరియు సెమీ ఫైనల్స్,లాంటివి అని గణేష్ బందోబస్త్ ఫైనల్స్ లాంటిది , మీరందరూ ఫైనల్స్ విజయం సాధిస్తారని ఖచ్చితంగా ఈ సందర్భానికి తగినట్లుగా రాణిస్తారని నేను అనుకుంటున్నాను అని అన్నారు. విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు తెలియజేసి అనుమతి తీసుకోవాలని సీపీ ఆనంద్ తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం కృత్రిమ చెరువుల వద్ద పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి మట్టిని వాడేందుకు ఖైరతాబాద్ గణేష్ కమిటీ అంగీకరించిందని తెలియజేసారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు కొరకు జి హెచ్ ఎం సి తో కలసి ఎలా పనిచేయాలో ఆయన వివరించారు సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రతి స్థాయిలో మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయడం,. విద్యుత్, నీరు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు. శాంతి కమిటీ సభ్యులు చురుగ్గా పాల్గొని సామాజిక మాధ్యమాలు, వికృత పోస్టులు చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
కొంతమంది ఎస్‌హెచ్‌ఓలు, డీసీపీలు మరియు నగర పోలీసులు మొదటిసారిగా ఈ బందోబస్తును నిర్వహిస్తున్నారు వీరికి ఇది ఒక పెద్ద టాస్క్ లాంటిది దీంట్లో మీరందరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను అని సీపీ అన్నారు. ఈ సమావేశంలో విగ్రహాల ఏర్పాటు, సమాచార పత్రాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, మట్టి విగ్రహాల నిమజ్జనం, ఊరేగింపు మార్గాలు, జాగ్రత్తలపై సీపీ సీవీ ఆనంద్ పలు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశానికి శ్రీ.డి.ఎస్ చౌహాన్ IPS Addl.CP. L&O, Sri.AR శ్రీనివాస్ IPS క్రైమ్ & SIT, శ్రీ.M.రమేష్ IPS Jt.CP Admn, Sri.AV రంగనాథ్ IPS Jt.CP ట్రాఫిక్, శ్రీ.కార్తికేయ IPS Jt.CP CAR Hqtrs, Sri.Gajarao Bhupal IPS Jt.CP సిసిఎస్ డిడి హైదరాబాద్ మరియు అన్ని డిసిఎస్‌పిలు మరియు ఎస్‌హెచ్‌ఓలు హాజరయ్యారు.


