Allఆంధ్రప్రదేశ్తెలంగాణ
సాహితి చైర్మన్ లక్ష్మనారాయణ టీటీడీ పదవిపై నీలి నీడలు…….. బాధితులు

సాహితీ చైర్మన్ చేసిన అక్రమాలు ఫ్రీ లాంచ్ పేరుతో ప్రజలను మోసం చేసిన విషయంలోనూ ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 6 నుంచి 8 వెంచర్లు వేసి వాటిలో ఎవ్వరికి ఎటువంటి న్యాయం చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు టీటీడీ బోర్డు పదవి నుండి తొలగించమని ఏపీలో తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది సాహితీ అనే బోర్డులు పెట్టుకొని లక్ష్మనారాయణ దోచుకున్న సొమ్ము ప్రజలకు తిరిగి ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నందుకు అతనిపై చర్య తీసుకునే విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి సాహితీలో డబ్బులు తీసుకువెళ్లి ఆయనకు ఇచ్చి తద్వారా పదవిని కొనుక్కున్నాడు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంతేకాకుండా ఏ అర్హత ఉందని సాహితీ చైర్మన్ లక్ష్మీనారాయణకి టీటీడీ బోర్డు మెంబర్ గా పదవి ఇచ్చారు గతంలో ఆయన చరిత్ర ఎవరికీ తెలియదు ఎవరికీ దానం చేసింది గాని ఎవర్ని ఆదుకుంది గాని ఎక్కడా లేదు అకస్మాత్తుగా డబ్బులు కుమ్మరించి పదవి కొనుక్కున్నాడు జగన్ , వైవి సుబ్బారెడ్డి ఇద్దరు డబ్బులకు ఆశపడి అతనికి పదవి కట్టబెట్టారని తెలుస్తోంది. నిజా నిజాలు ఎట్లున్న ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ, అర్హతకు మించి పదవి ఇచ్చారు అనేది స్పష్టమవుతుంది. కొందరితో లక్ష్మీనారాయణ తాను కొన్ని కోట్లు ఖర్చుపెట్టి పదవిని కొనుక్కున్నానని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నట్లు బాధితులు చెప్తున్నారు. ఈ విషయంపై టీడీపీ బోర్డు సభ్యులు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పవిత్రమైన క్షేత్రంలో పాపులు ఉండకూడదని బాధితులు భక్తులు చెప్తున్నారు టీటీడీ బోర్డు పదవిని అడ్డం పెట్టుకొని సాహితీ చైర్మన్ లక్ష్మణ్ నారాయణ అక్రమాలకు పాల్పడుతున్నాడని వాటిలో ముఖ్యమైనది రియల్ ఎస్టేట్ గా బాధితులు చెబుతున్నారు వెంటనే అటువంటి వ్యక్తిని పదవిలో లేకుండా తొలగించాలని అటు భక్తులు మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్లు రాజకీయ నాయకులు అందరూ మూకుమ్మడిగా జగన్ కి చెప్పినట్టు తెలుస్తోంది




