‘విరించి’ హాస్పిటల్ వికృత చేష్టలు

విరించి హాస్పిటల్ ధన దాహం వలన ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది వివరాల్లోకి వెళితే అత్తాపూర్ కాంత రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న పల్లి శ్రీనివాస్ (52) అనే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఈనెల 13వ తారీఖున అనారోగ్యం కారణంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో గల విరించి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హాస్పటల్ సిబ్బంది అతనికి అన్ని పరీక్షలు చేసి వెన్నుపూస సమస్య ఉన్నట్లుగా గుర్తించారు తగిన చికిత్స చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి అతనికి వైద్య భీమా ఉంది కాబట్టి మీరేమీ పే చేయనవసరం లేదు అని చెప్పి చికిత్స చేశారు. అనంతరం ఈనెల 17వ తారీఖున అతనిని డిశ్చార్జ్ చేస్తాము ఇంకా కొంత సొమ్ము మీరు కట్టాలి అని హాస్పిటల్ సిబ్బంది మొయినుద్దీన్ మరియు అశోక్ ఇద్దరు కలిసి పేషంట్ ని వత్తిడి చేశారు అదేమిటి మొత్తం ట్రీట్మెంట్ వైద్య బీమా లో చేస్తాము అని చెప్పారు కదా అని అడగగా వారు పేషెంట్తో వాదనకు దిగి బ్యాలెన్స్ మొత్తం పే చేస్తే కానీ డిస్చార్జ్ చేయము అని కరాకండిగా చెప్పడంతో పేషెంట్ పిల్లి శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే హాస్పిటల్ సిబ్బంది అతనిని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా రెండు రోజులు చెప్పి శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఆయన మృతి చెందినట్లుగా నిర్ధారించి ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తన తండ్రి మృతికి హాస్పటల్ యాజమాన్యమే కారణంగా తెలుపుతూ హాస్పిటల్ పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మృతిని కుమారుడు పల్లి తేజ రావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పంజాగుట్ట పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్లుగా తెలియజేశారు.




