తనీష్, వికాస్ వశిష్ట (సినిమా బండి) హీరోలుగా శ్రీ ఎమ్ నివాస్ దర్శకత్వంలో లో “అంతేలే కథ అంతేలే”

అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం”అంతేలే కథ అంతేలే” .రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్ ,వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్) , శ్రీనివాస్ నటీ నటులుగా మహారాజశ్రీ,లంక వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందినటువంటి దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం “అంతేలే కథ అంతేలే” సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు శ్రీ యం నివాస్ మాట్లాడుతూ :రిధిమ క్రియేషన్స్ పతాకంపై నా డైరెక్షన్ లో అంతేలే కథ అంతేలే” సినిమా నిర్మిస్తున్నాము. సినిమా బండితో అందరినీ మెప్పించి నటువంటి నటుడు వికాస్ వశిష్ట ఇంకా తనీష్ హీరోలుగా .సెహర్ కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.నెస్ట్ మంత్ షూటింగ్ వెళుతున్న ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ, అనేక భావోద్వేగాలు ఈ కథలో మిళితమై ఉంటాయి.ఈ చిత్రాన్ని అనంతపురం, నల్గొండ, హైదరాబాద్ లల్లో మూడు షెడ్యూల్ లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.




