సినిమాలు
సీనియర్ నటుడు విద్యాసాగర్ ఇకలేరు!

సీనియర్ నటుడు విద్యాసాగర్ కన్నుమూశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు పక్షవాతం రావడంతో వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ‘ఈ చదువులు మాకొద్దు’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ ‘ఆహనా పెళ్లంట’ ‘మాయగాళ్లు’) వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన అనేక సినిమాల్లో విద్యాసాగర్ నటించారు. సీనియర్ నటి రత్నాసాగర్ విద్యాసాగర్ భార్య. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.




