తెలంగాణ

ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాల లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్‌!

క్యాసినోవాలాగా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన
కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ చికోటి కార్యకలాపాలు
కొనసాగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.నయీమ్ కు కూడా సంబంధాలు పెట్టుకున్న ఏకైక జిల్లా మెదక్
ఓల్డ్ జిల్లా మీకు తెలుసా మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ కాదు మరి కొంతమంది మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు
కూడా ఈ గేమ్ లో పాల్గొన్నట్టు అతనితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ప్రవీణ్ ఈడికి సమాచారం ఇచ్చారు
సంగారెడ్డి జిల్లా ఓల్డ్ మెదక్ జిల్లా లో ఉన్న కొంతమంది మంత్రులు నయీమ్ తోనే సంబంధాలు ఉన్నా వారు ఉన్నారు
అలాగే నయీమ్ బతికున్నప్పుడు వారితో మాట్లాడిన పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. మెదక్ జిల్లా ఏమి తక్కువ
తినలేదు అనడానికి చికోటి ప్రవీణ్ వీటికి ఇచ్చిన సమాచారం అంత విలువైనది మెదక్ జిల్లా నేతలతో చికోటి ప్రవీణ్‌ కుమార్‌కు సత్సంబంధాలు
ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన ఏడుపాయలలో చికోటి ప్రవీణ్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.
హరిత హోటల్‌లో నిర్వహించిన వేడుకలకు సుమారు 150 మంది ప్రముఖులు హాజరైనట్లు తెలిపింది. జన్మదిన వేడుకల
కోసం హరిత హోటల్‌లో చక్రపాణి పేరుతో 6 గదులు, 2 హాల్స్ బుకింగ్ చేశారు. గోవా టూర్‌తో చీకోటి ప్రవీణ్‌ కుమార్‌కు మెదక్‌
జిల్లాలోని ప్రముఖ నేతలు, వ్యాపారులు పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. చీకోటితో చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నారు
. చికోటి లిస్ట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ సైతం ఉన్నట్లు సమాచారం. చీకోటి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రముఖ పేర్లు బయటకు వస్తుండటం కలకలం సృష్టిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker